News June 4, 2024

నితిన్ గడ్కరీ హ్యాట్రిక్

image

కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కరీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ థాక్రేపై 1.37 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానంలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం. మరోవైపు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి గజేంద్ర షెకావత్ గెలిచారు. అటు రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పర్షోత్తమ్ ఖోడాభాయ్ 4.84 లక్షల ఓట్ల మెజారిటీతో విక్టరీ సాధించారు.

Similar News

News October 26, 2025

జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉప‌ఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్‌తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్‌’ అంతగా ఉండకపోవచ్చు.

News October 26, 2025

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <>సైట్‌<<>>లో టెన్త్ క్లాస్ రోల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే స్టూడెంట్ వివరాలు వస్తాయని చెప్పింది. ఏమైనా తప్పులుంటే రిక్వెస్ట్ లెటర్‌ను కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా ఈ నెల 28లోగా RIO ఆఫీసులో అప్లై చేసుకోవాలని సూచించింది. పేరు మార్పు కోసం బ్యాంకులో రూ.100 చలాన్ కట్టాలని చెప్పింది.

News October 26, 2025

ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

image

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.