News June 4, 2024
రాజస్థాన్‌లో బీజేపీకే పట్టం

రాజస్థాన్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 14, కాంగ్రెస్ 8, సీపీఐ(ఎం), RTLP, భారత్ ఆదివాసీ పార్టీ తలో స్థానంలో విజయం సాధించాయి. బీజేపీకి అత్యధికంగా 49.24శాతం, కాంగ్రెస్‌కు 37.91శాతం ఓట్లు వచ్చాయి. BJP నుంచి గెలిచిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్, స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఉన్నారు.
Similar News
News January 9, 2026
మేడారం భక్తుల కానుకలు.. భద్రమేనా..!?

మేడారం జాతరలో హుండీలో భక్తుల కానుకలకు ఈసారైనా దేవదాయ శాఖ అధికారులు భద్రత కల్పిస్తారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత మేడారం జాతరలో అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి జాతరలో ఏర్పాటు చేసిన హుండీలకు వర్షపు నీరు చేరి భక్తులు వేసిన బియ్యం, నోట్ల కాగితాలు, ఇతర కానుకలు తడిసి ముద్దయ్యాయి. లక్షల రూపాయలు బూజు పట్టి పనికిరాకుండా పోయాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
News January 9, 2026
మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్‌కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి
News January 9, 2026
ఆస్కార్ బరిలో మహావతార్, కాంతార: చాప్టర్-1

ఆస్కార్-2026 బరిలో మహావతార్ నరసింహ, కాంతార: చాప్టర్-1 నిలవనున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. బెస్ట్ పిక్చర్ విభాగంలో పోటీ పడనున్నట్లు తెలిపింది. ఇందుకు ఎంతో గర్వపడుతున్నట్లు పేర్కొంది. గతేడాది విడుదలైన ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతారలో విజువల్ ఎఫెక్ట్స్, రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి.


