News June 4, 2024
బొత్స, ధర్మాన కుటుంబాలకు షాకిచ్చిన ఓటర్లు
బొత్స, ధర్మాన కుటుంబాలకు ఓటర్లు భారీ షాకిచ్చారు. విజయనగరం జిల్లా చీపురపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య.. టీడీపీ చేతిలో ఓడిపోయారు. అటు విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగిన బొత్స ఝాన్సీ ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి పోటీలో నిలిచిన ధర్మాన కృష్ణదాస్ కూడా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
Similar News
News November 29, 2024
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. త్వరలో ట్రయల్ రన్!
దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ రన్‌ను త్వరలో హరియాణాలోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు. 8 కోచ్‌లు ఉండే ఈ రైలులో 2,638 మంది ప్రయాణించవచ్చు. గరిష్ఠ వేగం 110km/h ఉంటుంది. ఈ ట్రైన్ డిజైన్‌ను RDSO రూపొందించింది. ప్రస్తుతం దీనిని ‘నమో గ్రీన్ రైలు’గా పిలుస్తున్నారు. కాగా ప్రపంచంలో జర్మనీ మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్లను నడుపుతోంది.
News November 29, 2024
30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు తిరిగొచ్చాడు
1993, సెప్టెంబర్ 8న ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కిడ్నాపైన రాజు 30 ఏళ్ల తర్వాత తిరిగొచ్చారు. స్కూల్ నుంచి వస్తుండగా తనను కిడ్నాప్ చేసి రాజస్థాన్ తీసుకెళ్లారని అతను చెప్పారు. రోజూ కొడుతూ పని చేయించారని, పారిపోకుండా రాత్రి పూట తాళ్లతో కట్టేసేవారని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు తప్పించుకొని ఢిల్లీ చేరుకున్న అతను 5 రోజుల కిందట ఖోడా పోలీసులను సంప్రదించారు. వారు మీడియా సాయంతో కుటుంబం వద్దకు చేర్చారు.
News November 29, 2024
ధనుష్ పెట్టిన కేసుపై నయనతార లాయర్ స్పందన ఇదే
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్స్ వాడుకున్నారంటూ ధనుష్ వేసిన <<14722518>>సివిల్ కేసుపై<<>> నయనతార తరఫు లాయర్ స్పందించారు. ఇందులో కాపీరైట్ ఉల్లంఘన ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘నయనతార-విఘ్నేశ్ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న Lex Chambers పర్సనల్ లైబ్రరీ నుంచి ఆ క్లిప్ తీసుకున్నాం. అది సినిమాలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ కేసుపై DEC 2న విచారణ జరిగే అవకాశం ఉంది.