News June 4, 2024
పవన్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్

ఎన్నికల ముందు ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసిన డైరెక్టర్ ఆర్జీవీ దారికొచ్చారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించడంతో ఆయన కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయి. దీంతో ట్విటర్లో ‘హేయ్ పవన్ కళ్యాణ్’ అంటూ దండాలు పెట్టే ఎమోజీలను పోస్ట్ చేశారు. దీంతో ‘ఇప్పుడు తెలిసిందా పవన్ అంటే ఏంటో?’ అని ఆయన ఫ్యాన్స్ ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News September 8, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TGలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు APలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
News September 8, 2025
సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
News September 8, 2025
‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం: TS UTF

TG: ప్రభుత్వ టీచర్లకు TET తప్పనిసరి అని ఇచ్చిన <<17587484>>తీర్పును<<>> సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కోరింది. ’20-25 ఏళ్లుగా విధుల్లో ఉన్న సీనియర్లను TET రాయమనడం అన్యాయం. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారం TET పాస్ అనేది నియామకాలకు తప్పనిసరి అయింది’ అని గుర్తుచేసింది.