News June 4, 2024

విశాఖ ఎంపీగా శ్రీభరత్

image

విశాఖ ఎంపీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీభరత్‌కి 9,07,467 ఓట్లు పోలవ్వగా.. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి 4,03,220 ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.సత్యారెడ్డి 30,267 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

Similar News

News November 11, 2025

పెదగంట్యాడలో ఎంఎస్ఎంఈ పార్క్‌కు శంకస్థాపన

image

రాష్ట్రంలో ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం పెదగంట్యాడలో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్‌కి మంత్రులు డీఎస్ బీవీ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీ భరత్ శంఖుస్థాపన చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో 27 ఎం.ఎస్.ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు.

News November 11, 2025

పైనాపిల్ కాలనీలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన

image

జీవీఎంసీ 13వ వార్డు పైనాపిల్ కాలనీలో పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.7.3 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.

News November 11, 2025

విశాఖ కలెక్టరేట్‌లో మైనారిటీ వెల్ఫేర్ డే

image

అబుల్ కలాం జయంతి పురస్కరించుకొని విశాఖ కలెక్టరేట్ లో జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు.కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ఆనందపురంలో పీకేరు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో ముస్లింలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మైనారిటీ సొసైటీ భూములు 22ఏ నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.