News June 4, 2024
ఈ రిజల్ట్‌తో EC హ్యాపీ: హర్ష గోయెంకా
ఎన్నికల ఫలితాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంతోషంగా ఉంది. 100 సీట్లతో కాంగ్రెస్ కూడా హ్యాపీనే. UPలో ప్రదర్శనపై SP, మహారాష్ట్రలో గెలుపొందిన సీట్ల పట్ల NCP-SP, SS- UBT, బెంగాల్‌లో ప్రభంజనం సృష్టించడంపై TMC సంతోషంగా ఉన్నాయి. ఈ ఫలితాలతో ఎలక్షన్ కమిషన్ ఊపిరి పీల్చుకుంది. EVMలపై నిందలు లేవు. ఇది సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అని పోస్ట్ పెట్టారు.
Similar News
News November 29, 2024
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP 43 కమిటీలు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు, యువత, SC, OBCలే లక్ష్యంగా ప్రచారానికి 43కమిటీలను నియమించింది. 70 సీట్లున్న ఢిల్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా కమిటీలను ఎంపిక చేశారు. నామినేషన్లు, మీడియా వ్యవహారాలు, డేటా మేనేజ్‌మెంట్ తదితర ఎన్నికల పనులను ఈ కమిటీలు చేయనున్నాయి.
News November 29, 2024
శ్రీవారి దర్శనానికి 13 గంటల టైమ్
AP: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వరుడిని 56,952 మంది దర్శించుకున్నారు. 21,714 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు లభించింది.
News November 29, 2024
ధర్మాన మాజీ పీఏ మురళి అరెస్ట్
AP: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ, వైద్యారోగ్య శాఖ ఉద్యోగి మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో నిన్నటి నుంచి మురళి, అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 20 ఎకరాల భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు, కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.