News June 4, 2024
లోక్‌సభ స్థానాలు.. ఎవరికి ఎన్ని సీట్లంటే?
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 286 సీట్లు సాధించింది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 196 సీట్లలో గెలించింది. మరో 3 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇతరులు 50 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా.. ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని గంటల్లో క్లియర్ పిక్చర్ రానుంది.
Similar News
News November 29, 2024
చరిత్ర సృష్టించిన జాన్సెన్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు <<14734849>>పడగొట్టిన<<>> సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ చరిత్ర సృష్టించారు. ఓ ఇన్నింగ్స్‌లో 7 ఓవర్ల లోపే(6.5) 7 వికెట్లు తీయడం 120 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1904లో AUS బౌలర్ హ్యూయ్ ట్రంబుల్ ENGపై 6.5 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీశారు. కాగా ప్రస్తుత టెస్టులో సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్కోర్లు: SL 42, RSA 191&132/3
News November 29, 2024
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పయనం కానున్నారు. దీపాదాస్ మున్షీ, వంశీచంద్ రెడ్డి తదితరులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు.
News November 29, 2024
టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగింపు
TG: టెన్త్ పరీక్షల్లో <<14735937>>ఇంటర్నల్ మార్కులను<<>> తొలగించిన విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్నీ తొలగించాలని నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్ లెట్+అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇవ్వనుంది. సైన్స్ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించింది.