News June 4, 2024

మెజార్టీలో తండ్రిని మించిన తనయుడు

image

AP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈసారి భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు మెజార్టీని తలదన్నేలా.. ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. CBNకి 47,340 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో 1989లో CBN తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2009 నుంచి ఆయన మెజార్టీ 45వేల మార్కు దగ్గరే ఉంటోంది.

Similar News

News November 29, 2024

భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి

image

APలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా మన్యంలో చలి పంజా విసురుతోంది. గత ఏడాది NOV 10-30 తేదీల్లో 13-13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి మరో 5డిగ్రీలు తగ్గిపోయాయి. నిన్న డుంబ్రిగూడలో 8.6, జి.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8, అరకులోయలో 9.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం, సాయంత్రం బయటికెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News November 29, 2024

కులగణన తర్వాత రిజర్వేషన్లలో మార్పులు!

image

TG: సమగ్ర కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఉన్నందున ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 31న సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవ్వగా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

News November 29, 2024

BJPకే సీఎం పదవి!

image

మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మహాయుతి నేతలు శిండే, అజిత్ పవార్ అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. మరో రెండు రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఉండాలని అజిత్, శిండేలను బీజేపీ హైకమాండ్ కోరినట్లు సమాచారం. హోం, ఆర్థిక, రెవెన్యూ లాంటి కీలకశాఖలు బీజేపీకే దక్కే అవకాశం ఉంది.