News June 5, 2024

చంద్రబాబు విజయంపై డిక్లరేషన్ ఫారం అందుకున్న టీడీపీ నేతలు

image

టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నుండి 47వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బాబు విజయంపై టిడిపి నేతలు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టిడిపి కుప్పం ఇంచార్జ్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. సురేష్ తదితరులు కుప్పం ఆర్వో శ్రీనివాసులు వద్ద డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

Similar News

News July 7, 2025

తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరు మృతి

image

తిరుపతి కపిలతీర్థం వద్ద సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. భక్తులు, యాచకులపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ యాచకుడు మృతి చెందగా, మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు‌. సైకో కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 7, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదంట..!

image

చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 9896 Mtsల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 10514 mtsల యూరియా నిల్వ చేయగా 6032 mtsలను ఇప్పటి వరకు రైతులు తీసుకెళ్లారు. 4200 Mts యూరియా అందుబాటులో ఉంది. గోడౌన్‌లో 1852 Mts, ప్రైవేట్ డీలర్స్ దగ్గర 1300Mts, RSKలలో 738 Mts, కంపెనీ గోడౌన్‌లో 300Mts మేర నిల్వ ఉండటంతో యూరియా కొరత రాదని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ Way2Newsకు తెలిపారు.

News July 7, 2025

బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద భక్తులపై హిజ్రాల దాడి

image

బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులపై హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం ఆటోలో వచ్చారు. బోయకొండ వద్ద ఆటోలు ఆపిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అడిగినంత ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ఈ దాడిలో ఐదుగరు గాయపడగా.. వారు చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.