News June 5, 2024

KNR: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 5,711 ఓట్లు పోలవగా.. కరీంనగర్‌లో అత్యల్పంగా 5,438 ఓట్లు పోలయ్యాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి మండలంలో విద్యుత్ షాక్‌తో గేదె మృతి.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ వేములవాడలో పర్యటించిన దేవాదాయ, జౌలి చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు.
@ జగిత్యాల కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.
@ వేములవాడ ఏరియా ఆసుపత్రికి మూడవసారి కాయకల్ప అవార్డు.

News October 1, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.82,779 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,632, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,000, అన్నదానం రూ.17,147 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News October 1, 2024

KNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.