News June 5, 2024

మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న గౌతు శిరీష

image

పలాస నియోజకవర్గ పరిధి 22వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు 61,210 ఓట్లు, ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీషకు 1,01,560 ఓట్లు పోలయ్యాయి. కాగ ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీష 40,350 ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించారు. ఈమె మొదటి ప్రయత్నంలో ఓడినప్పటికీ రెండవ ప్రయత్నంలో విజయం సాధించి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

Similar News

News October 6, 2024

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో విన్నర్‌గా సిక్కోలు విజయం

image

విజయవాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా జట్టు పాల్గొంది. ఈ క్రమంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలో జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబురావు, బమ్మిడి శ్రీరామ మూర్తి ఆదివారం తెలిపారు. నేడు కూడా పలు పోటీలు కొనసాగుతున్నాయని దీనిలో భాగంగా జిల్లా క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు వచ్చిందన్నారు.

News October 6, 2024

వంగర: చెరువులో పడి యువకుడి మృతి

image

వంగర మండల కేంద్రంలోని అరసాడలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో సుకాసి శంకర్ (29) గల యువకుడు గ్రామ శివాలయం వెనుక బాహ్య ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లి చెరువులో కాలుజారి చనిపోయినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఆదివారం మృతుని తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News October 6, 2024

మాజీ మంత్రి అప్పలరాజుని కలిసిన ధర్మాన

image

వైసీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుని ఆదివారం వైసీపీ యువ నాయకులు డా.ధర్మాన కృష్ణ చైతన్య గౌరవ పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అతనితో పాటు ఎంపీపీ మురళీధర్, గోపి, జడ్పీటీసీ రామారావు, సుడా మాజీ ఛైర్మన్ గుప్త, కన్వీనర్లు జగన్, నరసింగరావు పాల్గొన్నారు.