News June 5, 2024
62 తర్వాతి రికార్డు.. 60 ఏళ్ల తర్వాత బ్రేక్
దేశంలో 1962 తర్వాత హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పడలేదు. 1951-52, 1952-57, 1957-62 మధ్య కాంగ్రెస్ వరుసగా 3 పర్యాయాలు పాలించింది. 2014, 19 తర్వాత NDA ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి 60 ఏళ్ల రికార్డు సమం చేయనుంది. అటు దేశానికి 1947-62 మధ్య నెహ్రూ PMగా 16 సం.ల 286 రోజులున్నారు. కానీ రాజ్యాంగం అమలయ్యాక చూస్తే ఇది 13సం.లు. దీంతో గణతంత్ర భారతంలో మోదీ 15సం. PMగా కొనసాగి నెహ్రూ రికార్డు బద్దలవనుంది.
Similar News
News November 29, 2024
ధరణి సమస్యల పరిష్కార బాధ్యత వారిదే..
TG: ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి బాధ్యత అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలదేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్లికేషన్ల పరిష్కారానికి తహశీల్దార్‌కు 7 రోజులు, ఆర్డీవోకు 3 రోజులు, అదనపు కలెక్టర్‌కు 3 రోజులు, కలెక్టర్‌కు 7 రోజుల గడువు ఇచ్చింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించింది.
News November 29, 2024
రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలు: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. LSలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫాస్టాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి రాలేదన్నారు.
News November 29, 2024
శీతాకాలంలో కొందరికే చలి ఎక్కువ.. ఎందుకంటే?
కొందరు ఉన్న చలి కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. విటమిన్లు, పోషకాల లోపం వల్ల కొందరి శరీరం వేడిని నిర్వహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఐరన్ లోపం ఉన్న వారి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చలి అనుభవిస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తక్కువ రక్త ప్రవాహం ఉండేవారికీ చలి ఎక్కువగా పుడుతుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.