News June 5, 2024
ఈ రాష్ట్రాలే ‘400 పార్’ కలను చెదరగొట్టాయా?
NDA 293 సీట్లకే పరిమితం కావడం వెనుక UP, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్ రాష్ట్రాల ప్రభావం ఉందంటున్నారు విశ్లేషకులు. యూపీలో 80 సీట్లూ క్లీన్ స్వీప్ చేస్తామని ఆశించిన బీజేపీకి 36 సీట్లే వచ్చాయి. మహారాష్ట్రలో 2019లో 48లో 41 సీట్లు సాధించిన NDA ఈసారి 17 సీట్లకు పరిమితమైంది. బెంగాల్‌లో TMC దెబ్బకు BJP 12 సీట్లకే చతికిలపడింది. బిహార్‌లోనూ NDA 2019తో పోలిస్తే తొమ్మిది సీట్లు కోల్పోయి 39కి పరిమితమైంది.
Similar News
News November 28, 2024
రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!
ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.
News November 28, 2024
సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం
AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
News November 28, 2024
నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్
వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్‌నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్‌షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్‌గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.