News June 5, 2024

డిపాజిట్లు కోల్పోయిన ట్రాన్స్‌జెండర్లు!

image

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు ట్రాన్స్‌జెండర్లూ డిపాజిట్లు కోల్పోయారు. ధన్‌బాద్ నుంచి పోటీ చేసిన సునైనా కిన్నార్ అనే స్వతంత్ర అభ్యర్థికి 3,462 ఓట్లు వచ్చాయి. దక్షిణ ఢిల్లీ నుంచి బరిలో నిలిచిన రాజన్ సింగ్‌కు కేవలం 325 ఓట్లే పోలయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో దామో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దుర్గా మౌసికి 1,124 ఓట్లు వచ్చాయి.

Similar News

News November 28, 2024

రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!

image

ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.

News November 28, 2024

సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

News November 28, 2024

నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్

image

వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్‌నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్‌షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్‌గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.