News June 5, 2024
కోవూరు తొలి మహిళా MLAగా ప్రశాంతిరెడ్డి

కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. మరోవైపు అక్కడ గెలిచిన తొలి ఎమ్మెల్యే రికార్డును తన బుట్టలో వేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ 14 సార్లు సాధారణ, ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఓ ఏ ఒక్క మహిళకూ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే అవకాశం రాలేదు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రశాంతి రెడ్డి 54, 583 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు.
Similar News
News January 21, 2026
నెల్లూరు: 11 ప్రాజెక్టులు.. 2942 అంగన్వాడీలు

నెల్లూరు జిల్లా పునర్విభజనతో ICDS శాఖ పరిధి పెరిగింది. గతంలో 12 ప్రాజెక్టులు.. 2934 అంగన్వాడీ కేంద్రాలు ఉండేవి. పునర్విభజనలో కందుకూరు(164), ఉలవపాడు(183) మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు ప్రకాశంలో కలిసిపోగా.. గూడూరు, చిల్లకూరు, కోట పరిధిలోని 355 కేంద్రాలు నెల్లూరులోకి వచ్చాయి. దీంతో జిల్లాలో 11 ప్రాజెక్టులు, 2942 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
News January 21, 2026
నెల్లూరు: అసలు దొంగలు ఎవరు..?

ఉదయగిరిలో పట్టుబడిన <<18909764>>ఎర్ర చందనం <<>>వెనుక అసలు పాత్రదారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా ఉంది. అటవీ సిబ్బంది, పోలీసులకు తెలియకుండా భైరవకోన కొండ ప్రాంతం నుంచి ఉదయగిరి అర్లపడియ వైపు ఎర్రచందనం ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. అక్కడ గ్రామస్థులు అడ్డుకోకపోయి ఉంటే సరిహద్దులు దాటి వెళ్లిపోయేది. నిఘాపెట్టాల్సిన పోలీసులు, అటవీ రేంజ్ సిబ్బందికి తెలియకుండానే ఇది జరిగి ఉంటుందా? అని స్థానికులు అనుమానిస్తున్నారు.
News January 21, 2026
నెల్లూరు: PACSలో ఇక ఆన్‌లైన్ సేవలు

నెల్లూరు జిల్లాలోని 76 PACSలకు గాను 71 సంఘాల్లో పూర్తిస్థాయి కంప్యూటీకరణ చేశామని జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ప్రక్రియపై సీఈవోలకు రెండు రోజుల శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఇకపై PACS సంఘాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మాన్యువల్ పద్ధతి ఉండదన్నారు.


