News June 5, 2024
ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగింది: ఎస్సీ కమిషన్ సభ్యుడు

APలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని రాష్ట్ర SC కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో EC కుట్ర చేసిందన్నారు. తక్షణమే ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. TDP నేతలకు వేలల్లో, BJP MP అభ్యర్థులకు లక్షల్లో మెజార్టీ, JSP 21 సీట్లలో గెలవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని మెజార్టీ సర్వేలు వెల్లడించాయన్నారు.
Similar News
News September 10, 2025
రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.
News September 10, 2025
సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.
News September 10, 2025
వారసుడితో నాగబాబు ఫ్యామిలీ

వరుణ్-లావణ్య జోడీ మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. ‘సింహం కూనకు స్వాగతం. నీవు నా హృదయంలో గర్జించావు. నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.