News June 5, 2024

ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

image

TG: ఇవాళ WGL-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్‌లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. నల్గొండ(D) సమీపంలోని దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు. తీన్మార్ మల్లన్న(CONG), రాకేశ్ (BRS), అశోక్(స్వతంత్ర) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

Similar News

News November 28, 2024

‘నా చావుకు నేనే కారణం’.. పరీక్షల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య

image

AP: అనంతపురం మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలో మెడికో వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ‘నా చావుకు నేనే కారణం. ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల ఒత్తిడిని భరించలేక చనిపోతున్నా. ఎగ్జామ్స్‌పై కాన్సన్‌ట్రేట్ చేయలేకపోతున్నా’ అని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 28, 2024

STOCK MARKETS: బ్యాంకింగ్, రియాల్టి షేర్లకు డిమాండ్

image

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 24,270 (-7), సెన్సెక్స్ 80,190 (-45) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందాయి. చివరి 2 సెషన్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు స్వీకరిస్తున్నారు. మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, O&G రంగాల్లో డిమాండ్ కనిపిస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. TECH M, INFY, EICHERMOT, M&M, HCL TECH టాప్ లూజర్స్.

News November 28, 2024

ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు

image

AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.