News June 5, 2024
నీట్ ఫలితాలు.. కటాఫ్ ఎంతంటే?
నిన్న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ నుంచి 43,858 మంది, తెలంగాణలో 47,371 మంది అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు వంద లోపు ర్యాంకుల్లో నిలిచారు. పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్ విభాగం కటాఫ్ 164, EWSకు 146, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 129గా నిర్ణయించారు. ఈ మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు.
Similar News
News November 28, 2024
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం: సీఎం
TG: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని CM రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారన్నారు.
News November 28, 2024
డే నైట్ టెస్టుల్లో ‘పింక్ బాల్’ ఎందుకంటే?
క్రికెట్లో సంస్కరణల్లో భాగంగా డేనైట్ టెస్టులను ICC 2015లో ప్రారంభించింది. సాధారణ టెస్టులు రెడ్ బాల్‌తో జరుగుతుండగా, డేనైట్ ఫార్మాట్‌ను పింక్ బాల్‌తో నిర్వహిస్తున్నారు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయడం వల్ల రెడ్ బాల్ ఫ్లడ్ లైట్ల వెలుగులో సరిగ్గా కనిపించదు. అందుకే పింక్ బాల్‌ను వాడుతుంటారు. టెస్టు క్రికెటర్ల డ్రెస్సులు తెల్లగా ఉన్నందున వైట్ బాల్‌ను ఉపయోగించరు. 9 ఏళ్లలో 22 డే నైట్ టెస్టులు జరిగాయి.
News November 28, 2024
ఫలితాలపై ఇండియా కూటమి హ్యాపీ: డీకే శివకుమార్
ఝార్ఖండ్ ఫలితాలపై ఇండియా కూటమి హ్యాపీగా ఉందని కర్ణాటక DCM డీకే శివకుమార్ అన్నారు. మహారాష్ట్ర ఓటమిపై అంతర్మథనం అవసరమన్నారు. మిగతా వాళ్లలా EVMలపై ఆయన నిందలేయకపోవడం గమనార్హం. ‘హేమంత్ సోరెన్ నాయకత్వంలో మా కూటమి గెలవడం హ్యాపీ. ఆయన మెరుగైన పాలన అందించారు. కష్టపడి ప్రజల్లో విశ్వాసం పొందారు. ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మహారాష్ట్ర ప్రజల తీర్పును మేం గౌరవించి ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల’ని అన్నారు.