News June 5, 2024
పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకే సెంటిమెంట్

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకసారి గెలిచిన వారు మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారు. 1994 నుంచి 2019 ఎన్నికల వరకు ఇదే కొనసాగింది. 2009లో ఈ స్థానం ఎస్టీలకు కేటాయించగా.. విజయరామరాజు పాతపట్నంకి మారడంతో సవరపు జయమణి గెలిచారు. 2014లో జయమణి ఎన్నికలకు దూరంగా ఉండగా.. చిరంజీవులు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ బోనెల విజయ్ చంద్ర 20వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
Similar News
News January 13, 2026
పోలీసు పరేడ్ గ్రౌండులో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో సంక్రాంతి సంబరాలను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు ముఖ్య అతిధిగా హాజరై సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పోలీసు కుటుంబాలను కూడా భాగస్వాములను చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
‘విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదు’

రబీ 2025–26 పంట కాలానికి విజయనగరం జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 12,606 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా.. ప్రస్తుతం 2,914 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొంది. అదనంగా 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుంది. రైతులు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని అధికారులు సూచించారు.
News January 13, 2026
15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.


