News June 5, 2024
బీఆర్ఎస్‌కు ఇదే తొలిసారి
TG: BRS పార్టీ తొలిసారిగా లోక్‌సభ ప్రాతినిధ్యం కోల్పోయింది. పార్టీ ఏర్పడిన 23 ఏళ్లలో గులాబీ పార్టీకి ఇలాంటి ఘోర పరాభవం ఇదే తొలిసారి. 2004లో కాంగ్రెస్‌తో పొత్తుగా బరిలో దిగి 5 చోట్ల విజయం సాధించింది. 2009లో 2, 2014లో 11, 2019లో 9 చోట్ల గెలుపొందింది. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన ఓటర్లు ఈ ఎన్నికల్లో మాత్రం తిరస్కరించారు.
Similar News
News November 28, 2024
తమిళనాడులో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి!
తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
News November 28, 2024
10 రోజుల ముందుగానే ‘అయోధ్య’ వార్షికోత్సవం.. కారణమిదే
యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీనే రామాలయ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగగా, 10 రోజుల ముందుగానే వార్షికోత్సవం నిర్వహించడానికి ఓ కారణం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య శుక్ల ద్వాదశి(కూర్మ ద్వాదశి) నాడు వేడుక నిర్వహించాలి. 2025లో ఈ తిథి జనవరి 11నే రావడంతో ఆ రోజే వేడుకలు జరగనున్నాయి.
News November 28, 2024
PHOTOS: ఎన్డీఏ ఎంపీలకు పవన్ కళ్యాణ్ విందు
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ పురోగతిని ఆకాంక్షిస్తూ AP, తెలంగాణ NDA ఎంపీలకు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రులు శాండిల్య గిరిరాజ్ సింగ్, రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు పలువురు NDA ఎంపీలు, కీలక నేతలు హాజరయ్యారు.