News June 5, 2024
జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!
AP ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం ఉప్పెనలా వచ్చారు. జగన్ బస్సుయాత్రలోనూ పోటెత్తారు. ఆ తర్వాత ప్రచార సభలకూ బ్రహ్మరథం పట్టారు. ఫలితాల్లో మాత్రం 11 MLA, 4 MP సీట్లతో YCPకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. రాయలసీమలోని వైసీపీ కంచుకోటలనూ కూటమి బద్దలుకొట్టింది. తమ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా? అనేలా అంతుచిక్కని ఫలితాలు రావడంతో YCP శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
Similar News
News November 28, 2024
ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు
AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.
News November 28, 2024
ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా: ఆర్జీవీ
AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
News November 28, 2024
తమిళనాడులో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి!
తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.