News June 5, 2024

ఫలించిన విశాఖ పోలీసుల వ్యూహం

image

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసకాండతో ఓట్ల లెక్కింపు నిర్వహణపై విశాఖ నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీపీ రవిశంకర్ అయ్యర్ ప్రత్యేక వ్యూహంతో నగరమంతటా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందు తర్వాత నగరంలో ప్రశాంత వాతావరణ నెలకొనడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు.

Similar News

News January 26, 2025

విశాఖలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

image

విశాఖలోని ఆశీల్‌మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్‌ఐ సురేష్ కోరారు.

News January 26, 2025

విశాఖ: 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పుర‌స్కారాలు

image

గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ భారక్స్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి 446 మందికి ప్ర‌తిభా పుర‌స్కారాలు అందజేశారు. అందులో 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పుర‌స్కారాలు దక్కాయి. వారిలో VMRDA కమీషనర్ కె.ఎస్.విశ్వ‌నాథ‌న్, జాయింట్ కలెక్టర్ కె.మ‌యూర్ అశోక్ ,ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ ఇమ్మ‌డి పృథ్వీతేజ్, డిప్యూటీ క‌లెక్ట‌ర్లు కె.సంగీత్ మాథుర్, సుధాసాగ‌ర్ ఉన్నారు.

News January 26, 2025

ప్రథమ బహుమతి సాధించిన gvmc శకటం 

image

76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో వివిధ శాఖల నుంచి 9 శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి జీవీఎంసీ , ద్వితీయ బహుమతి డీ.ఆర్.డీ.ఏ, తృతీయ బహుమతి వీఎంఆర్డిఏ శకటాలు సాధించాయి. మిగతా విద్యా, సమగ్ర శిక్ష అభియాన్ శకటాలకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు.