News June 5, 2024

ప్రారంభమైన కౌంటింగ్

image

TG: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు <<13382331>>ప్రక్రియ<<>> ప్రారంభమైంది. ఈ స్థానంలో ప్రధాన అభ్యర్థులుగా రాకేశ్ రెడ్డి(BRS), తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ), అశోక్(స్వతంత్ర) బరిలో ఉన్నారు. నిన్న వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News November 28, 2024

ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు

image

AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.

News November 28, 2024

ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా: ఆర్జీవీ

image

AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

News November 28, 2024

తమిళనాడులో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి!

image

తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.