News June 5, 2024
YCP ఓటమిని తట్టుకోలేక అభిమానులు మృతి

AP అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఘోర ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా(D) గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్(28) జగన్ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి చెందడం తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. YSR(D) దిగువ తంబళ్లపల్లెకు చెందిన YCP కార్యకర్త చిన్నయల్లాలు(63) గుండెపోటుతో చనిపోయాడు. కర్నూలు(D) చిన్నతంబళంలోనూ ఉరుకుందప్ప(68) టీవీ చూస్తూ YCP ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచారు.
Similar News
News January 1, 2026
ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? ఆటంకాలు జరగొచ్చు!

విపత్తు సంభవించే ముందు ప్రకృతి మనకు సంకేతాలిస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పసుపు, కుంకుమ నేలపై పడటం, పాలు పొంగి చిందడం, అద్దాలు పగలడం నష్టానికి సూచనలట. పూజలో దీపం పదే పదే ఆరిపోవడం, ఎర్ర చీమలు వరుసగా కనిపించడం ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయట. కుక్కలు ఏడవడం, కాకులు ఇంటి ముందు అరవడం, మొక్కలు ఎండిపోవడం అశుభ శకునాలని అంటున్నారు. వీటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
News January 1, 2026
CBNపై KCR విమర్శలు.. TDP నేతల ఫైర్!

AP CM చంద్రబాబుపై BRS చీఫ్ KCR ఇటీవల చేసిన <<18634035>>వ్యాఖ్యలపై<<>> AP TDP నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. CBN స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందని, KCRకి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి ఆనం ఫైరయ్యారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం బాధించిందన్నారు. అధికారం పోయినప్పుడల్లా CBNపై పడి ఏడవటం BRSకు అలవాటుగా మారిందని, కేసీఆర్ TDPలోనే పెరిగారని నిన్న MLA బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
News January 1, 2026
ఈ ఏడాది పండుగల తేదీలివే..!

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 4న హోలీ, 19న ఉగాదితో పాటు 19/20న రంజాన్ పండుగ ఉండనుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రానున్నాయి. ఆగస్టు 28న రాఖీ, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న దసరా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్‌తో ఏడాది ముగియనుంది. share it


