News June 5, 2024
NGKL: పోటీలో లేకుండానే బర్రెలక్క ఓటమి

నాగర్ కర్నూల్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష (బర్రెలక్క) పోటీలో లేకుండానే ఓడిపోయారు. అసలు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కంటే నోటాకే వచ్చిన ఓట్లే ఎక్కువ. మొత్తానికి నోటాకు 4580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News February 28, 2026
MBNR: అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం

మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు సన్నిధిలో ఆదివారం నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణంతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ తెలిపారు. రేపు ధ్వజారోహణం, గరుడ వాహనసేవ, మంగళవారం విమాన రథోత్సవం. అయితే, చంద్రగ్రహణం కారణంగా ఈసారి కళ్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గ్రహణం రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఆలయ ద్వారబంధనం ఉంటుందన్నారు.
News February 28, 2026
MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News February 28, 2026
మహబూబ్‌నగర్: వచ్చే నెల 4న హోలీ పండుగ

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు హోలీ పండుగను మార్చి 4వ తేదీన నిర్వహించాలని జిల్లా బ్రాహ్మణ సంఘం తెలిపింది. జ్యోతిష్య పండితులచే చర్చించిన అనంతరం 2వ తేదీన కామ దహన కార్యక్రమం నిర్వహించాలని, 3న చంద్రగ్రహణం ఉన్నందున4వ తేదీన హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు.


