News June 5, 2024
సాయంత్రం ఇండియా కూటమి భేటీ
పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన INDIA కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు AICC చీఫ్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. తాజా ఫలితాల్లో ఇండియా కూటమి 234 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 99 సీట్లలో గెలిచింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి బయట పార్టీలను కూడా ఆహ్వానించే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Similar News
News November 28, 2024
మహారాష్ట్ర CM ఎంపికపై నేడు కీలక భేటీ
మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు నేడు సమాధానం దొరికే అవకాశముంది. ఢిల్లీలో BJP అగ్రనేతలతో ఫడణవీస్, శిండే, అజిత్ పవార్ భేటీ కానున్నారు. CM ఎవరన్నది ‘మహాయుతి’ నేతలు ఈ మీటింగ్‌లో ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. CM, ఇద్దరు dy.CMలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఎక్కువ శాతం BJPనే పదవి వరించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 23న ఎన్నికల ఫలితాలు రాగా, 5 రోజులుగా సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
News November 28, 2024
వాలంటీర్లకు మరో షాక్
AP: ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10వేల జీతం పెంచాలని 5 నెలలుగా ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్‌లో వాలంటీర్లు హాజరువేసుకునే ఆప్షన్‌ను అధికారులు తొలగించారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా మంత్రి వీరాంజనేయస్వామి వాలంటీర్లు వ్యవస్థలో లేరని ప్రకటించాక పూర్తిగా ఆప్షన్‌ను తీసేసినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.
News November 28, 2024
బీ-ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్
AP: ఎంపీసీ, బైపీసీ విభాగాల్లోని బీ-ఫార్మసీ సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ స్టూడెంట్స్ రేపు, ఎల్లుండి ఫీజు చెల్లించవచ్చు. ఆప్షన్స్ నమోదుకు డిసెంబర్ 1 వరకు ఛాన్స్ ఉంటుంది. 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. బైపీసీ విద్యార్థులు ఈ నెల 30 నుంచి DEC 5 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. 12వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి.