News June 5, 2024

జిల్లా మారినా.. గుమ్మనూరుకే పట్టం

image

గుమ్మనూరు జయరామ్‌కు అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 30, 2024

నంద్యాలలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 29, 2024

వెల్దుర్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని డోన్ రైల్వే గేట్ల సమీపంలో ఉన్న ఈద్గా వద్ద కాచిగూడ నుంచి యశ్వంతపూర్ వెళుతున్న వందే భారత్ రైలు కింద మస్తాన్ వలి (74) పడడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. కర్నూలు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 29, 2024

2న జిల్లాస్థాయి స్కేటింగ్ ఎంపిక పోటీలు

image

జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో అక్టోబర్ 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి పక్కిరెడ్డి తెలిపారు. ఇన్లైన్, క్వాడ్ స్కేటింగ్ క్రీడాంశలలో రింక్ రేస్, రోడ్ రేస్‌లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు RSFI పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారు నవంబర్ 6-10వ తేదీ వరకు కాకినాడలో జారిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.