News June 5, 2024
మల్కాజిగిరి: కాంగ్రెస్ కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. BJP చేతిలో పరాజయాన్ని చవిచూడడానికి అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీకి కాంగ్రెస్ సీనియర్లు KLRతో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పార్టీ నాయకులు అంటున్నారు.
Similar News
News March 2, 2026
HYD: నీటిలో మురుగు.. జలమండలికి ఉరుకు!

నగర తాగునీటిలో కాలుష్య సెగ తగలకుండా జలమండలి ‘బస్తీ బాట’ పట్టింది. పైపులైన్లు లీకై మురుగునీరు కలిస్తే కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించడంతో అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. రోజూ 5 వేల శాంపిల్స్ పరీక్షలు చేస్తున్నా, పురాతన పైపులైన్ మార్పు జలమండలికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్రమ కనెక్షన్లే కాలుష్యానికి కేంద్రాలని గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నారు.
News March 2, 2026
HYD: నిరుద్యోగులకు అలర్ట్.. త్వరలో నోటిఫికేషన్

మహానగర తాగునీటి సరఫరా బలోపేతానికి HMWSSB ఆధ్వర్యంలో మంజీరా, గండిపేటకు మరో రెండు పైపులైన్‌లు వేయాలని నిర్ణయించారు. HYDలో 300 వార్డులకు విస్తరించిన వేళ పని భారం మోసేందుకు అధికారులు అవసరం కానున్నారు. దీంతో 136 మేనేజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు ఇప్పటికే ఇంజినీర్లు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు
News March 2, 2026
HYD: లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు మీవే..!

కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’కు విశేష స్పందన లభిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన వధువు లేదా వరుడు ఉన్న జంటలకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 13,419 జంటలకు సుమారు రూ.238 కోట్లకు పైగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు.


