News June 5, 2024

BREAKING: ప్రిలిమ్స్ వాయిదా వేయలేం: HC

image

TG: గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్ మరో తేదీకి మార్చాలని దాఖలైన పిటిషన్‌పై వ్యాఖ్యానించింది.

Similar News

News November 28, 2024

కీర్తి సురేశ్ పెళ్లి ఎప్పుడంటే?

image

‘మహానటి’ కీర్తి సురేశ్ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియుడు ఆంటోనీని ఆమె వివాహమాడనున్నట్లు నిన్న ప్రకటించారు. కాగా వీరి వివాహం వచ్చే నెల 11న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో జరగనుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కీర్తి నటించిన బేబీ జాన్(బాలీవుడ్), ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

News November 28, 2024

చంద్రబాబుపై కేసుల్లో కౌంటర్ వేయండి: హైకోర్టు

image

AP: 2014-19 మధ్య స్కామ్‌లు జరిగాయంటూ చంద్రబాబుపై నమోదైన కేసులు, ఛార్జిషీట్లను హైకోర్టు ముందు ఉంచాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న పిల్‌పై కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

News November 28, 2024

ఎల్లుండి 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు

image

TG: పలు కారణాలతో రుణ‌మాఫీ నిలిచిన 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు సంక్షేమంపై CM రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు.