News June 5, 2024

జగన్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

image

తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ‘సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది. దీనిపై విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News October 7, 2024

అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ₹23 కోట్లు అంటూ ప్రచారం.. ప్రభుత్వం ఏమందంటే?

image

AP: ఇటీవల వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందించడంతోపాటు మొబైల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ సమస్యలు తీర్చామని తెలిపింది. వాటన్నిటికీ కలిపి రూ.23 కోట్ల ఖర్చయిందని, అందులోనూ మొబైల్ జనరేటర్లకు ఎక్కువ మొత్తం వెచ్చించామని పేర్కొంది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది.

News October 7, 2024

జానీ మాస్టర్‌ బెయిల్ రద్దు కోసం కోర్టుకు పోలీసులు!

image

అత్యాచారం కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

News October 7, 2024

అడిగిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు మంత్రి

image

చెన్నై ఎయిర్ షోకు కోరిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వైద్య బృందాలతో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిన్న ఈవెంట్‌కు వచ్చిన జనం అవస్థలు పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని BJP రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.