News June 5, 2024

25 ఏళ్ల తరువాత కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలు TDP కైవసం

image

1985లో నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, ఏరాసు అయ్యపురెడ్డి విజయం సాధించారు. 1989, 1991, 1996లో టీడీపీ గెలవలేకపోయింది. 1998లో నంద్యాలలో టీడీపీ గెలవగా.. కర్నూలులో కాంగ్రెస్ గెలిచింది. 1999లో కర్నూలు, నంద్యాల స్థానాల నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014, 2019లో ఓడిపోయింది. ప్రస్తుతం ఈ రెండు చోట్లా టీడీపీ గెలిచింది.

Similar News

News September 29, 2024

వెల్దుర్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని డోన్ రైల్వే గేట్ల సమీపంలో ఉన్న ఈద్గా వద్ద కాచిగూడ నుంచి యశ్వంతపూర్ వెళుతున్న వందే భారత్ రైలు కింద మస్తాన్ వలి (74) పడడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. కర్నూలు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 29, 2024

2న జిల్లాస్థాయి స్కేటింగ్ ఎంపిక పోటీలు

image

జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో అక్టోబర్ 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి పక్కిరెడ్డి తెలిపారు. ఇన్లైన్, క్వాడ్ స్కేటింగ్ క్రీడాంశలలో రింక్ రేస్, రోడ్ రేస్‌లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు RSFI పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారు నవంబర్ 6-10వ తేదీ వరకు కాకినాడలో జారిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News September 29, 2024

రేపు నందికొట్కూరులో జాబ్ మేళా

image

నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సునీత తెలిపారు. 10వ తరగతి, ఆపై చదివిన నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు tinyurl.com/jobmelagdcndk లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.