News June 5, 2024
చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

AP: EVMలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ MLA <<13377622>>రవీంద్రనాథ్<<>> రెడ్డి ఆరోపించారు. ‘సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ట్యాంపరింగ్ చేశారు. బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 28, 2026
భారీ ధరకు ‘స్పిరిట్’ OTT హక్కులు?

డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న ‘స్పిరిట్’ సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. చిత్రీకరణ పూర్తవకముందే దీని OTT హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషన్ కాకుండా ఈ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ధరకు OTT రైట్స్ విక్రయించినట్లు వెల్లడించాయి. కాగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుంచి తిరిగి ప్రారంభంకానుందని తెలిపాయి.
News January 28, 2026
BARCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(<
News January 28, 2026
దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు కేసులో MLA దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా రిప్లై ఇవ్వలేదు. తాజాగా ఆయనను విచారణకు పిలవాలని స్పీకర్ నిర్ణయించారు. దానం విచారణ తర్వాత SCకి స్పీకర్ రిప్లై ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు MLAలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.


