News June 5, 2024
లోక్‌సభ రిజల్ట్: అమెరికా స్పందన ఏంటంటే!
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అమెరికా తటస్థ వైఖరి ప్రదర్శించింది. విజేతలు, పరాజితులపై మాట్లాడబోమని తెలిపింది. ‘అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించినందుకు భారత ప్రభుత్వం, ప్రజలకు అభినందనలు. ఆరు వారాల్లో వివిధ దశల్లో ఓటింగ్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ విన్నర్స్, లూజర్స్ గురించి మేం స్పందించం. ఇక్కడా అంతే’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.
Similar News
News November 28, 2024
మహిళలూ మీరంతా నాకు స్ఫూర్తి: కేటీఆర్
TG: రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాడుతున్న మహిళలు తనకు స్ఫూర్తి అని KTR తెలిపారు. ‘సమ్మక్కలు, సారక్కలు. మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలు. అలుపెరగని పోరాటం చేస్తున్న రుద్రమ్మలు. మీరంతా నాకు స్పూర్తి. ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. హైడ్రా, గురుకులాలు, బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలు, దిలావర్ పూర్‌లో ఇథనాల్ పరిశ్రమపై నిరసనలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.
News November 28, 2024
HYDలో తగ్గిన యాపిల్ ధరలు
గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో యాపిల్ ధరలు తగ్గాయి. 2023 డిసెంబర్‌లో మంచి నాణ్యత గల యాపిల్స్ ఒక్కోటి ₹35-₹40, సాధారణ రకం పండ్లు ఒక్కోటి ₹25కు లభించాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి హై క్వాలిటీ యాపిల్స్ ఒక్కోటి ₹18, రెగ్యులర్ క్వాలిటీ పండ్లు ఒక్కోటి ₹10కే దొరుకుతున్నాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పంటలు బాగా పెరగడం, HYD పండ్ల మార్కెట్‌లకు సరఫరా పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 28, 2024
వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి
TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.