News June 5, 2024
నెల్లూరు పాత కలెక్టర్‌కు భారీ ఓటమి
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన దారుణంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 54,844 ఓట్లే వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు నోటాకు 15,577 ఓట్లు పడ్డాయి. కాగా రాజు 1988 నుంచి 1992 వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
Similar News
News January 14, 2025
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం
సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
News January 13, 2025
మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2025
నెల్లూరు: భోగి మంట వేస్తున్నారా..?
సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.