News June 5, 2024

విజయనగరం: నాలుగు ఎన్నికలు.. నాలుగు పార్టీలు

image

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

Similar News

News November 17, 2024

విజయనగరంలో విద్యార్థిని సూసైడ్

image

విజయనగరంలోని పడాల్ పేటకు చెందిన విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ వివరాల ప్రకారం.. వీర వెంకట లక్ష్మి (19) మైగ్రేన్ సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈనెల 13న నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగేసిందని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News November 17, 2024

VZM: జిల్లాలో నిఘానేత్రాన్ని పటిష్ఠం చేస్తున్నాం: SP

image

జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపులు, కాలేజ్‌లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని SP వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా షాపు యజమానులకు, వ్యాపారవేత్తలకు, అపార్టుమెంట్ వాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు.

News November 17, 2024

హిందూస్థాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఎంపీ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సదస్సులో చంద్రబాబు ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని, కింజరాపు పాల్గొన్నారు.