News June 5, 2024
వారి నుంచి స్ఫూర్తి పొందుతా: సమంత
తాను పక్కవారి నుంచి స్ఫూర్తి పొందుతానని హీరోయిన్ సమంత అన్నారు. ప్రతి రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి విజయాలను చూసి కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఐఎండీబీ ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’లో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2024
మూడేళ్లలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా TG: న్యాబ్
TG: వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇందుకోసం త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’ను తయారు చేస్తామన్నారు. డ్రగ్స్ నివారణపై పలు వర్సిటీలు, కాలేజీల సిబ్బందికి అవగాహన కల్పించారు. మార్కెట్‌లోకి రోజుకో కొత్త రకం డ్రగ్ వస్తోందని, నిటాజిన్ అనే డ్రగ్ ఒక్క గ్రాము 40 కిలోల ఓపీఎంతో సమానమని పేర్కొన్నారు.
News November 28, 2024
ఘోరం: ప్రియురాలిని చంపి 50 ముక్కలు చేసి..
ఝార్ఖండ్‌కు చెందిన నరేశ్ చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తూ సొంతూరు వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో ఆమెను హత్య చేశాడు. పదునైన ఆయుధాలతో శరీరాన్ని 50 ముక్కలు చేసి అడవిలో పారేసి పరారయ్యాడు. ఓ కుక్క యువతి శరీర భాగంతో తిరగడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు చికెన్ షాపులో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
News November 28, 2024
ఉక్రెయిన్‌కు మరిన్ని US ఆయుధాలు
జనవరిలో తన పదవీ విరమణకు ముందే ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేయడానికి US అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు. రష్యాతో యుద్ధం చేస్తోన్న ఆ దేశానికి $725 మిలియన్ల విలువైన ఆయుధాలను పంపనున్నారు. ఇందులో యాంటీ ట్యాంక్ వెపన్స్, ల్యాండ్ మైన్స్, డ్రోన్స్, స్టింగర్ మిస్సైల్స్, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ కోసం అవసరమైన సామగ్రి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే US కాంగ్రెస్ ఆమోదం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.