News June 5, 2024
BREAKING: HYD: యువతిని కత్తితో పొడిచిన యువకుడు

HYD దుండిగల్ PS పరిధిలోని గండిమైసమ్మ వద్ద ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ యువతి కడుపులో యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆమెపై కత్తితో దాడి చేయడమే కాకుండా అతడు ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో యువకుడిని స్థానిక అరుంధతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 26, 2025
HYD: మహానగరంలో 311 గ్రామాలు..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన నోటిఫికేషన్ రావడంతో గ్రేటర్ స్వరూపమే మారిపోయింది. శివారు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు GHMCలో కలవడంతో 2053 చదరపు కి.మీ విస్తీర్ణం పెరిగింది. ఇపుడు మహానగరంలో 311 గ్రామాలు, 47 మండలాలు, ఐదు జిల్లాలు భాగమయ్యాయి. ఆరు పార్లమెంటు స్థానాలు ఉండగా 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
News December 26, 2025
HYD: దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించిన భర్త

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాలు.. భార్యపై అనుమానంతో వెంకటేశ్ తన భార్య త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని ఇంటి బయటకు తీసుకెళ్లి త్రివేణిని దహనం చేసి వెంకటేశ్ పరారయ్యాడు. మంటల్లో త్రివేణి దహనం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలింపు చేపట్టారు.
News December 26, 2025
GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

* శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు
* కూకట్‌పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్‌గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా


