News June 5, 2024

పామర్రు: నాడు తండ్రిని ఓడించారు.. నేడు కొడుకును గెలిపించారు

image

2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

Similar News

News September 29, 2024

’30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు ధన్యవాదాలు’

image

రాష్ట్రానికి 30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ పశ్చిమ MLA సుజనా ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ట్వీట్ చేశారు. అమరావతిలో రూ.250కోట్లతో 400 పడకల ESI ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేసిందని సుజనా తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 29, 2024

తప్పు చేసుంటే అరెస్ట్ చేసుకోండి: పేర్ని నాని

image

తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫైల్స్ వెతికారని, అసైన్డ్ పట్టాలు చూశారన్నారు. తాను తప్పు చేసింటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు.

News September 29, 2024

కృష్ణా: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

image

కానూరు తులసినగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18- 35 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు అక్టోబర్ 3లోపు ఈ శిక్షణకు ఫెడరల్ స్కిల్ అకాడమీలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. Shareit