News June 5, 2024

నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తా: ఎంపీ ధర్మపురి 

image

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద సవాల్ విసిరారు.

Similar News

News October 2, 2024

కామారెడ్డి: రూ.10 లక్షలతో పోస్టల్ ఉద్యోగి పరార్

image

రూ.10లక్షల పెన్షన్ డబ్బులతో పోస్టల్ ఉద్యోగి పరారైన ఘటన బీబీపేట్‌లో చోటుచేసుకుంది. తుజాలాపూర్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసే దేవిసోత్ బిక్యానాయక్ పోస్ట్ ఆఫీస్ డబ్బును పక్కదారి పట్టించి గతంలో సస్పెండ్ అయ్యాడు. కాగా గతనెల 30న ఇస్సానగర్, తుజాలాపూర్ గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు SI ప్రభాకర్ వెల్లడించారు.

News October 2, 2024

NZB: బస్సు పైన ప్రమాదకరంగా ప్రయాణం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు రావడంతో మంగళవారం బస్‌స్టాండ్‌లు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారడంతో కొందరు ప్రమాదకరంగా బస్సు మీదకు ఎక్కి ప్రయాణించారు. కాగా పండుగ నేపథ్యంలో బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 2, 2024

NZB కలెక్టర్‌తో మంత్రి పొంగులేటి, సీఎస్ సమీక్ష

image

రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారి కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి పైలట్ ప్రోగ్రాం కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.