News June 5, 2024
మాచర్ల డైనమైట్స్.. జూలకంటి ఫ్యామిలీ!
AP: మాచర్ల.. ఇక్కడ రాజకీయం చేయడం నేతలకే కాదు కార్యకర్తలకూ కత్తి మీద సామే. గత 15 ఏళ్లుగా తన అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సామ్రాజ్యాన్ని జూలకంటి బ్రహ్మారెడ్డి(TDP) కూలదోశారు. గతంలో జూలకంటి తండ్రి, తల్లి కూడా ఇక్కడ నెగ్గారు. 1972లో నాగిరెడ్డి ఇండిపెండెంట్గా గెలిచారు. దీంతో ఆయన్ను పల్నాటి పులి అంటారు. 1999లో బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ TDP నుంచి నెగ్గారు.
Similar News
News November 28, 2024
ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు
AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.
News November 28, 2024
ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా: ఆర్జీవీ
AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
News November 28, 2024
తమిళనాడులో ఫాక్స్కాన్ భారీ పెట్టుబడి!
తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.