News June 5, 2024
BREAKING: మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను ఆపద్ధర్మ పీఎంగా కొనసాగాలని కోరినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Similar News
News November 28, 2024
STOCK MARKETS: బ్యాంకింగ్, రియాల్టి షేర్లకు డిమాండ్
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 24,270 (-7), సెన్సెక్స్ 80,190 (-45) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందాయి. చివరి 2 సెషన్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు స్వీకరిస్తున్నారు. మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, O&G రంగాల్లో డిమాండ్ కనిపిస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. TECH M, INFY, EICHERMOT, M&M, HCL TECH టాప్ లూజర్స్.
News November 28, 2024
ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు
AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.
News November 28, 2024
ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా: ఆర్జీవీ
AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.