News June 5, 2024
సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డుల తొలగింపు
ఏపీ సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డులను అధికారులు తొలగించారు. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిలోని సామగ్రి తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా కీలక ఫైళ్లు మిస్ అవుతున్నాయనే ఆరోపణలతో పలు శాఖల అధికారులు ఇప్పటికే సోదాలు చేపట్టారు. ల్యాప్‌టాప్‌లు, డేటాను పరిశీలిస్తున్నారు.
Similar News
News November 28, 2024
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
దీపావళికి వచ్చి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News November 28, 2024
ప్రభుత్వం అలా.. ప్రతిపక్షం ఇలా!
TG: ఏడాదిలో రైతుల కోసం రూ.54,280కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి గుర్తుగా మహబూబ్‌నగర్‌లో మూడో రోజులపాటు ‘రైతు పండుగ’ నిర్వహిస్తోంది. అయితే రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్ వంటివి కలిపి ఇంకా రూ.40,800 కోట్లు చెల్లించాల్సి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏం చేశారని ‘రైతు పండుగ’ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై మీ కామెంట్.
News November 28, 2024
6 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో NIA దాడులు
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో NIA నేడు 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా సోదాలు ఆరంభించింది. ఇందుకు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంది. విదేశీ సిండికేటుతో ఇక్కడి ముఠాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తోంది. బాలకార్మికులు, నిరుపేదలే టార్గెట్‌గా వ్యాపారం చేస్తున్నట్టు అనుమానిస్తోంది. ఏయే రాష్ట్రాల్లో దాడులు చేపట్టారో తెలియాల్సి ఉంది.