News June 5, 2024
ఎచ్చెర్ల: పాత్రికేయుడి నుంచి ఎంపీగా..

రణస్థలం మండలం, వీఎన్ పురానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పాత్రికేయ వృత్తి నుంచి ఎంపీ వరకు ఎదిగారు. రణస్థలంలో గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ అప్పటి ఎచ్చెర్ల MLA స్పీకర్ కావలి ప్రతిభా భారతి అనుచరుడిగా మారారు. ఆమె అతడిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అనంతరం ఆయన TDP చేరారు. విజయనగరం YCP బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల మెజార్టీతో కలిశెట్టి విజయం సాధించారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.
News February 24, 2026
శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.
News February 24, 2026
SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్‌డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్‌ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్‌షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.


