News June 5, 2024

MBNR: BRS ఓటు BJPకి షిఫ్ట్

image

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలల వ్యవధిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న BJP వేగంగా పుంజుకుంది. MBNRలో విజయం సాధించింది. NGKLలో రెండో స్థానంలో నిలవడమే కాక రికార్డు స్థాయిలో ఓట్లు సాధించింది. దీనికి కారణం ప్రధాన ప్రతిపక్షమైన BRS ఓటు బ్యాంక్ చివరి క్షణంలో BJP వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది.

Similar News

News February 6, 2026

MBNR: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

image

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.

News February 5, 2026

పాలమూరు: నేటి ముఖ్య వార్తలు

image

✒PU.. డిగ్రీ ఫలితాలు విడుదల
✒MBNR: మున్సిపల్ ఎన్నికల పీసీసీ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
✒పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి
✒PMను కలిసే అవకాశం..రిజిస్ట్రేషన్ చేసుకోండి
✒పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ
✒మెట్టుగడ్డ మార్కెట్‌పై కాంగ్రెస్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒మున్సిపల్ ఎన్నికలు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం

News February 5, 2026

MBNR:PU.. ఫలితాలు విడుదల UPDATE!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనములో యూనివర్సిటీ ఉపకులపతి
ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ డిగ్రీ 1వ సెమిస్టర్(30.08%), 3వ సెమిస్టర్ (39.72%), 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.