News June 5, 2024

హైదరాబాద్‌లో వర్షం

image

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీన్‌పూర్, కాప్రా, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భిన్నంగా ఎండ కాస్తోంది. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

Similar News

News November 28, 2024

లొకేషన్ హిస్టరీ కావాలా? త్వరగా సేవ్ చేసుకోండి!

image

నిర్ణీత సమయం తర్వాత Google Mapsలోని హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించనున్నట్లు యూజర్లకు Google ఈ-మెయిళ్లు పంపుతోంది. చివరి 3 నెలల టైమ్‌లైన్‌ లొకేషన్‌ను తొలగించనున్నట్లు తెలిపింది. లొకేషన్‌ హిస్టరీ కావాలనుకున్న యూజర్లు తమ డివైజ్‌లలో మాన్యువల్‌గా/క్లౌడ్ నెట్‌వర్క్‌లో బ్యాకప్‌గా సేవ్ చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం గూగుల్ లొకేషన్ సర్వీసెస్‌‌లోకి వెళ్లి ఎక్స్‌పోర్ట్ యువర్ లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

News November 28, 2024

బీఆర్ఎస్‌వీ నాయకుల్ని తక్షణం విడుదల చేయాలి: కేటీఆర్

image

గురుకుల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్‌వీ నేతల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో మండిపడ్డారు. ‘ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? నిన్న అరెస్ట్ చేసిన మా విద్యార్థి నాయకుల జాడ నేటికీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా ? వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2024

‘బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు

image

దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్‌ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్‌పై ‘ఐశ్వర్యరాయ్-ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్‌కి తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.