News June 5, 2024

మహబూబ్‌నగర్‌లో ఓటమికి బాధ్యత నాదే: సీఎం రేవంత్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా MBNR ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదు రాష్ట్రానికి అని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలుపు ఓటములకు తానే బాధ్యుడిని అని చెప్పారు. ముఖ్యంగా సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఫలితానికి తానే బాధ్యత వహిస్తానని అన్నారు

Similar News

News February 12, 2026

MBNR: రేపే కౌంటింగ్.. ఇవి నిషేధం: SP

image

పాలమూరు యూనివర్సిటీ (లెక్కింపు కేంద్రం) పరిసర ప్రాంతాల్లో BNSS 163 ప్రకారం నిషేధాజ్ఞలు (సెక్షన్ 144 అమలు) శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

News February 12, 2026

MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్‌కే: SP

image

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.

News February 12, 2026

MBNR: ‘తెలంగాణ తరహా కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలి’

image

తెలంగాణ రాష్ట్రంలో ఉండే కులవృత్తుల మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులవృత్తులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రణవ నంద స్వామి పాదయాత్ర ప్రారంభించి 700 కిలోమీటర్లకు చేరగా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటక విధాన సభలో నారాయణ గురు స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.