News June 5, 2024
ఎమ్మెల్సీ కౌంటింగ్.. తీన్మార్ మల్లన్న ముందంజ..!

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News January 17, 2026
వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
News January 13, 2026
వరంగల్: రాజకీయ నాయకుల్లో సంక్రాంతి సంబరం..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.
News January 12, 2026
ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


