News June 5, 2024

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

image

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు కంగ్రాట్స్ తెలియజేశారు. ‘ఏపీ సీఎంగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ టర్మ్ విజయవంతంగా సాగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News November 11, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర నిన్న రూ.1800 & ఇవాళ ఏకంగా రూ.2,460 పెరిగి రూ.1,26,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,250 ఎగబాకి రూ.1,15,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై నిన్న రూ.4వేలు & ఇవాళ రూ.1,000 పెరిగి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 11, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, బీఎల్ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.isro.gov.in/

News November 11, 2025

మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

image

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.