News June 5, 2024
షర్మిలకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే?
AP: కడప పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన YS. షర్మిలకు మొత్తం 1,41,039 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డికి 6,05,143, టీడీపీ అభ్యర్థి భూపేశ్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు పడ్డాయి. అవినాశ్ 62,695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2.66% ఓట్ షేర్ వచ్చింది.
Similar News
News January 10, 2025
తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం
ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ప్రతికా రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53) అర్ధ సెంచరీలతో చెలరేగారు. స్మృతి మంధాన (41) పవర్‌ప్లేలో ధాటిగా ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో మాగూర్ 3 వికెట్లు, సార్జెంట్ ఓ వికెట్ పడగొట్టారు.
News January 10, 2025
RRRపై టార్చర్ కేసు.. విజయ్‌పాల్‌కు బెయిల్ నిరాకరణ
AP: రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా రెండో అదనపు కోర్టు కొట్టేసింది. విచారణ సందర్భంగా తనను విజయ్‌పాల్ చిత్రహింసలు పెట్టారని RRR ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదుకాగా, నిన్నటితో పోలీస్ కస్టడీ ముగిసింది.
News January 10, 2025
తెలంగాణకు సం‘క్రాంతి’లేదా?
సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.