News June 5, 2024

ముగిసిన NDA కూటమి నేతల భేటీ

image

ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ రోజు రాష్ట్రపతి వద్దకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు, నితీశ్ వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ద్రౌపది ముర్మును కోరనున్నారు.

Similar News

News January 31, 2026

రీప్లేస్‌మెంట్‌కు రెడీ.. పాక్ స్థానంలో ఆడతామన్న ఉగాండా

image

T20 WCలో ఆడటంపై పాక్ ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో క్రికెట్ ఆడే చిన్న దేశాలు పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికే దాని స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరిన <<18982902>>ఐస్‌లాండ్<<>>.. ఆ వెంటనే అందుబాటులో ఉండలేమని సెటైరికల్‌ పోస్ట్ చేసింది. ఇది ఉగాండాకు కలిసొస్తుందని పేర్కొంది. దీంతో నేడు ఉగాండా కూడా అవకాశం ఉంటే ఆడేందుకు తాము సిద్ధమని.. బ్యాగ్‌లు రెడీ చేసుకున్నామని ఫన్నీగా పోస్ట్ పెట్టింది.

News January 31, 2026

జంతు కొవ్వు కలిసిందని కేంద్ర సంస్థే చెప్పింది: లోకేశ్

image

AP: దేవుడి లడ్డూపై వైసీపీ డ్రామా మొదలుపెట్టిందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘2024లో చంద్రబాబు సీఎం కాగానే నెయ్యి శాంపిల్స్ తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా టెస్ట్ చేయగా జంతు కొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్ ఉందని తేలింది. మొన్నటి ఛార్జ్‌షీట్ పేజీ నెం.35లో సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది’ అని కాకినాడలో కార్యకర్తల సమావేశంలో తెలిపారు.

News January 31, 2026

WPL: ముంబైపై గుజరాత్ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 167/4 స్కోర్ చేయగా, అనంతరం ముంబై 20 ఓవర్లలో 156/7కి పరిమితమైంది. MI కెప్టెన్ హర్మన్ ప్రీత్ (48 బంతుల్లో 82*) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీ చరిత్రలో ముంబైపై గుజరాత్‌కి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.